సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన కెరీర్ సాధించిన సంగతి తెలిసిందే. అంచనాలకు మించి ఈ సినిమా విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా బుల్లితెరపై కూడా అంతే స్థాయిలో రికార్డులు సృష్టించటం విశేషం.
సరిలేరు నీకెవ్వరు సినిమా ఉగాది రోజున సాయంత్రం జెమినీ టీవీలో ప్రసారం అయ్యింది. అయితే… ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు గతంలో ఏ సినిమాలకు రానీ టీఆర్పీ రేటింగ్స్ రావటం విశేషం. ఇప్పటి వరకు బాహుబలి-2కు 22.70, బాహుబలికి 21.84 రేటింగ్స్ వచ్చాయి. తెలుగులో ఇప్పటి వరకు ఈ సినిమాలే అత్యధిక ప్రేక్షకాధరణ పొందగా… తాజాగా ప్రసారం అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఏకంగా 23.4పాయింట్లు రావటం విశేషం.
మహేష్ బాబు, రష్మీక మందన్న హీరోహీరోయిన్ లుగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి మంచి విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.