సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రిన్స్ మహేష్‌బాబు. మహర్షి సినిమాతో యావరేజ్ హిట్ కొట్టిన మహేష్ ఈసారి ఎలాగైనా బ్లాక్ బాస్టర్ కొట్టాల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరులో నటిస్తున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమా వర్క్ స్పీడ్‌గా సాగుతోందట. గత సంకాంత్రికి ఎఫ్-2తో వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అనిల్ రావిపూడి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.
అయితే, సరిలేరు నీకెవ్వరు సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి కొన్ని కరెక్షన్స్ చేస్తాడట. దాంతో విషయం తెలిసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫైర్ అవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా వినపడుతోంది. అసలు వంశీ పైడిపల్లికి కామెడీ టింజ్ ఉందా… అంటూ కూల్ మెన్ కాస్త ఫైర్ అవుతూ ఉన్నాడట.
కానీ అనిల్ రావిపూడి ఏం చేస్తాడు.. వంశీ పైడిపల్లి ఎంటరైంది మహేష్ అండతో కాబట్టి మహేష్ ఎది ఒకే అంటే అదే ఫైనల్ చేయక తప్పదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.