ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. మహర్షి సినిమాతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. మిలిటరీ ఆఫీసర్‌గా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ కు సంబందించిన కొన్ని స్టిల్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మరో వైపు లేడీ అమితాబ్ విజయశాంతి కూడా 13 సంవత్సరాల తరువాత ఈ సినిమా ద్వారా వెండితెరమీద కనిపించనున్నారు. దీపావళి కానుకగా విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లెక్చరర్ భారతిగా విజయశాంతి ఈ సినిమాలో కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ సమయం లో మహేష్, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ తో దర్శకుడు అనిల్ రావిపూడి సీన్ ఎక్సప్లైన్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్.
రష్మిక మందన్న హీరోయిన్ గా, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా, దిల్రాజు, అనిల్ సుంకర తో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకురానుంది.