ఈ నెల 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిట్ టాక్ తో మహేష్ బాబు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఎక్కడ ఈ సినిమా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఎంటర్ టైన్ చేయడంతోపాటు, కాస్తా ఎమోషన్ ను కూడా జతచేయడంతో సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. సంక్రాంతి సందర్బంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడాల్సిందేననేంతగా సూపర్ డూపర్ టాక్ ను అందిపుచ్చుకుంది. దీంతో నైజాంలో తొలిరోజే సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో 8.66 కోట్ల షేర్ రాబట్టింది. ఈ కలెక్షన్స్ మహేష్ కెరీర్ లోనే బెస్ట్ నైజాం ఫస్ట్ డే ఓపెనింగ్‌గా నిలిచాయి.