మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు . సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే రిలీజ్ అయిన మహేష్ బాబు లుక్స్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి . అయితే తాజాగా మూవీ యూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. మంగళవారం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ డేట్ ఎనౌన్స్ చేస్తున్నామని తెలిపింది. మహేష్ సినిమా టీజర్ ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్న అభిమానులకు మరి కొన్ని నిమిషాల్లో టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.
