ఈసారి మాత్రం అలా కాకూడదు అనుకుంటున్నాడో ఏమో కానీ మహేష్ సరిలేరు నీకెవ్వరూ షూట్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నాడు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కేరళలో చేశారు. ఈ షడ్యూల్ లో ఒక థ్రిల్లింగ్ ఫైట్ తో పాటు, రెండు సాంగ్స్ ని కూడా షూట్ చేస్తారు, నవంబర్ 25 వరకూ సినిమాకి ఈ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ అనే మాట కూడా వినిపించింది.
అనుకున్న దానికన్నా ముందే కంప్లీట్ అయ్యిందో లేక మేకర్స్ ప్లాన్ మార్చుకున్నారో తెలియదు కానీ కేరళ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తయిందని చెప్తూ చిత్ర యూనిట్ అంతా కలిసి రైల్వేస్టేషన్‌లో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మహేశ్, రష్మిక, ప్రకాశ్‌రాజ్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, సంగీత, అనీల్ సుంకర, అనీల్ రావిపూడి సహా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి దిగిన ఈ ఫోటో నెట్ లో హల్చల్ చేస్తోంది. మహేశ్ బాబు పార్ట్ కంప్లీట్ అయ్యిందో లేక సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యిందో తెలియదు కానీ ఇప్పటికైతే సరిలేరు నీకెవ్వరూ సినిమా విషయంలో నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఉంటే మాత్రం సరిలేరు నీకెవ్వరూ ప్రొమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతాయి.