సూపర్ స్టార్ మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి పోటీలో నిలబడుతున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైం పొంగల్ పోరులో అడుగుపెడుతున్న మహేశ్, ఇండస్ట్రీ హిట్ పై కన్నేశాడు. ఘట్టమనేని అభిమానుల్లో మాత్రమే కాకుండా సినీ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ చేసిన సరిలేరు నీకెవ్వరూ చిత్ర యూనిట్ కేరళ వెళ్ళింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక ట్వీట్ ద్వారా చెప్పిన అనీల్ రావిపూడి… మహేశ్ బాబు ఉన్న ఫొటోని కూడా షేర్ చేశాడు. ముందుగా కాశ్మీర్ లో షూట్ చేసిన చిత్ర యూనిట్, అక్కడ మేజర్ అజయ్ ఆర్మీ సీన్స్ తెరకెక్కించారు.
ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన సరిలేరు నీకెవ్వరూ టీం, రామోజీ ఫిల్మ్ సిటీలో కర్నూల్ ఎపిసోడ్ ని షూట్ చేశారు. కొండారెడ్డి బురుజు దగ్గర తీసిన సీన్స్ సినిమాకే హైలైట్ అవనున్నాయని సమాచారం. నవంబర్ ఎండింగ్ లోపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్న దర్శక నిర్మాతలు, కేరళలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. సినిమాలోని ఇంపార్టెంట్ సీన్స్ ని ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారని సమాచారం.