సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో పదమూడు సంవత్సరాల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ తో ఓ ఊపు ఊపిన మహేష్ సాంగ్స్ తో కూడా హడావిడి చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు మహేష్ సరసన నటిస్తున్న రష్మిక కు సంబందించిన లుక్ ఏది కూడా రిలీజ్ చెయ్యలేదు దర్శకుడు. తాజా రిలీజ్ చేసిన పాటలో మహేష్ బాబును రష్మిక మందన్న ఆట పట్టిస్తూ, వెంటపడుతూన్న ‘హి ఈజ్ సో క్యూట్’ పాటను రిలీజ్ చేసారు. జనవరి ఐదున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరపనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు.