సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజా గా టీజర్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్ ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కానీ విధంగా తొమ్మిది నిమిషాల వ్యవధిలో వన్ మిలియన్ వ్యూస్ ను సాధించింది.
టీజర్ రిలీజ్ చేసిన తొమ్మిది నిమిషాల్లో మహేష్ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ మహేష్ కెవ్వరు సరిలేరంటూ నిరూపించాడు.
టీజర్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు కూడా ఉండటం ఈ సినిమాకి మరింత బలమనే చెప్పాలి. ఇప్పటికే టీజర్ ని చుసిన మహేష్ ఫాన్స్ మహేష్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Watch Teaser here: