నవంబర్ 22 న మహేష్ టీజర్ - Tolivelugu

నవంబర్ 22 న మహేష్ టీజర్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో  ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. అటు అభిమానులు,  ఇటు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ డేట్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నవంబర్ 22 న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు  ఏకే ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా వేదికగా ఎనౌన్స్ చేసింది.
మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సుదీర్ఘ విరామం తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదలచేసిన లుక్స్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
sarileru neekevvaru teaser date release, నవంబర్ 22 న మహేష్ టీజర్
Share on facebook
Share on twitter
Share on whatsapp