సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. పక్కా మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫాన్స్ కి నచ్చేలా సినిమా తీశారని చెప్పొచ్చు. మహేష్ కామెడీ టైమింగ్ సినిమాలో హయిలైట్ కాగా ఆర్మీ మెన్ పాత్రలో మహేష్ అలరిస్తాడు. తమన్నా తో ఉన్న పాటలో మహేష్ డాన్స్ బెటర్ గా ఉంటుంది. అయితే పాటల కన్నా కూడా దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్న లేడీ అమితాబ్ విజయశాంతి తనకున్న పరిధిలో అద్భుతంగా చేసింది. అయితే హైప్ వచ్చినంత గొప్పగా ఏం లేదని అభిమానుల ఫీల్ కాక తప్పదు.
ఇక ప్రకాష్ రాజ్ యధావిధిగా తన నటన తో మెప్పించగా…. హీరోయిన్ రష్మీక పాత్ర మాత్రం కాస్త అతి అనిపిస్తుంది. ట్రైన్ ఫైట్ ఒకే అనిపిస్తుంది తప్పా హైప్ ఇచ్చిన రేంజ్ లో అయితే లేదు. కొన్ని కొన్ని సీన్స్ మహేష్ పాత చిత్రాలను గుర్తుకు తెస్తుంటాయి. కామెడీ ట్రాక్ కు కొంచెం మాస్, కొంచెం క్లాస్ కలిపి పండగ పూట సరదాగా సినిమాకు వెళ్లొచ్చేలా మూవీ ఉంటుంది. అలా లేకపోతే మహేష్ బడ్జెట్ సినిమా నిలదొక్కుకోలేదు.
Advertisements
అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది, బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్టా కాదా అనేది రేపు రిలీజ్ అయ్యే అల్లు అర్జున్ అల వైకుంటాపురములో మూవీపై ఆధారపడి ఉంటుంది.