యాంకర్ సుమ అనగానే పరుగు పరుగున వచ్చే మాటలు, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. సుమ షోలో ఉంటే ఆ ఉత్సాహామే వేరు. అందుకే సుమ ఫీజు కాస్త ఎక్కువైనా ఆమెను ఫ్రిఫర్ చేస్తుంటారు నిర్మాతలు. సరిలేరు నీకెవ్వరు ప్రిరిలీజ్ ఈవెంట్‌లో సుమా యాంకరింగ్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
స్టేజ్‌పైకి ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడుతూ వెళ్లిపోతున్నారు. హీరోయిన్ రష్మికా వచ్చి మహేష్ ఫ్యాన్స్‌ను చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు అని కామెంట్ చేస్తుంది. వెంటనే అందుకున్న సుమ… పర్వాలేదు మాట్లాడండి, ఎవరి డబ్బా వారు కొట్టుకోవాల్సిందే కదా మాట్లాడండి అంటూ కామెంట్ చేసింది. దీంతో సుమ వ్యాఖ్యలు సరిలేరు టీం పరువు తీసేలా ఉన్నాయన్న చర్చ మొదలైంది.
సినిమా ఏదైనా… ఎవరికి వారు వారి టీం పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడటం కామన్. కానీ సొంత డబ్బా అంటూ సుమ అలా కామెంట్ చేయటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.