పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్,టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం…. ఈ సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.
కాగా మహేష్ ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు మరో ముఖ్యమైన సన్నివేశాల కోసం స్పెయిన్ కు చిత్ర యూనిట్ వెళ్లబోతున్నట్లు సమాచారం. మూడు వారాల పాటు ఈ షూట్ ఉంటుందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షూట్ కనుక ఫినిష్ అయితే దాదాపు 70 నుంచి 80 శాతం మేర షూట్ కంప్లీట్ అవుతుందట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.