సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాని ఓకే చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా కుదరలేదు. దీనితో మొదట అనుకున్న అమెరికా షెడ్యూల్ ప్రారంభం కాలేదు. అంతేకాకుండా యూనిట్ సభ్యులకు వర్క్ పర్మిట్ లు లభించడంతో ఆలస్యం జరగడంతో షెడ్యూలు అప్పుడు క్యాన్సల్ అయింది.
కాగా తాజాగా తొలి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. మరో రెండు రోజుల్లో ఈ షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ముఖ్య సన్నివేశాలను, కొన్ని పాటలను అక్కడ షూట్ చేయబోతున్నారట. ఇక మహేష్ కూడా కుటుంబ సభ్యులతో దుబాయ్ కి బయలుదేరినట్లు తెలుస్తోంది. శుక్రవారంనాడు మహేష్ జన్మదినం కావడంతో పుట్టినరోజు వేడుకలు అక్కడే చేసుకుని అనంతరం షూటింగ్ లో మహేష్ పాల్గొంటారని సమాచారం.