మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా రెండో రోజు కూడా మెరిసింది. రెండో రోజు ఈ సినిమాకు 9 నుంచి 10 కోట్ల మధ్య షేర్ వస్తుందని ట్రేడ్ భావించింది. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 11 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. 60శాతం ఆక్యుపెన్సీకి బదులు, 75శాతం ఆక్యుపెన్సీ పెరగడంతో షేర్ పెరిగింది.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, రెండో రోజుకు సినిమా కోలుకుంది. మార్కెట్లో మరో పెద్ద సినిమా పోటీ లేకపోవడంతో, సర్కారువారి పాట కు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉంది. అది వసూళ్లపై ప్రభావం చూపించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాటకు వచ్చిన 2 రోజుల షేర్లు ఇలా ఉన్నాయి…
నైజాం – రూ. 17.10 కోట్లు
సీడెడ్ – రూ. 5.96 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.39 కోట్లు
ఈస్ట్ – రూ. 4.33 కోట్లు
వెస్ట్ – రూ. 3.19 కోట్లు
గుంటూరు – రూ. 6.34 కోట్లు
నెల్లూరు- రూ. 1.91 కోట్లు
కృష్ణా – రూ. 2.83 కోట్లు