సర్కారువారి పాట.. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను మే 12 న విడుదల చేస్తామని చాలా రోజుల కిందటే ప్రకటించారు. కానీ అందర్లో ఒకటే అనుమానం. చెప్పిన తేదీకి ఈ సినిమా వస్తుందా రాదా అనే డౌట్స్. దీనికి కారణం ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడమే. మరోవైపు రీషూట్స్ కూడా చేస్తారనే ప్రచారం ఉండనే ఉంది.
ఎట్టకేలకు ఈ అనుమానాలకు చెక్ పడింది. సర్కారువారి పాట షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా రామోజీ ఫిలింసిటీలో తీసిన మాస్ సాంగ్ తో ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది. గుమ్మడికాయ కూడా కొట్టేశారు. ఈ మేరకు యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో మహేష్ అభిమానులు ఊపిరి పీల్చున్నారు.
ఈ సందర్భంగా మరోసారి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే మే 12న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని విస్పష్టంగా ప్రకటించింది. అంతేకాదు, ఈరోజు సర్కారువారి పాట నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ లిరికల్ వీడియోలో కూడా మే 12 రిలీజ్ అనే విషయాన్ని మరోసారి స్పష్టంచేశారు.
దీంతో మహేష్ మూవీపై ఇన్నాళ్లూ కొనసాగిన అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇక రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైనట్టే. మహేష్, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.