సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇక ఈ సాంగ్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా కళావతి నేమ్ ట్రెండింగ్ అయింది. అలాగే ప్రోమో కూడా సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
దీంతో సాంగ్ పై మరింత హైప్ పెరిగింది. హైట్ కి తగ్గట్టుగానే అనంత శ్రీరామ్ లిరిక్స్, సిద్దు శ్రీరామ్ వాయిస్, తమన్ మ్యూజిక్ అన్ని కూడా అదిరిపోయాయి. ఇక విజువల్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
మహేష్ తో పాటు కీర్తి కూడా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది.
ప్రేమికుల రోజు సందర్భంగా ఈ పాటను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ముందుగానే లీక్ కావడంతో సాంగ్ ను రిలీజ్ చేశారు.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ తో సంయుక్తంగా మహేష్ బాబు నిర్మిస్తున్నారు.