సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట మే 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. కాగా లవర్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ కళావతి పాటను విడుదల చేయటానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో సంగీత ప్రియులను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంది. సిద్ శ్రీరామ్ వాయిస్ విజువల్స్ అన్నీ కూడా సాంగ్ పై ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయి.
మహేశ్ బాబు ఈ పాటలో కీర్తి సురేష్ అందాలను వర్ణిస్తూ కనిపించారు. యూరప్‌లోని అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ వారితో మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
#Kalaavathi… a glimpse 🙂@MusicThaman looking forward to the album!https://t.co/bxMrT0JM0h@KeerthyOfficial @ParasuramPetla @sidsriram @MythriOfficial @GMBents @14ReelsPlus #SarkaruVaariPaata
— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2022