సూపర్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పాట లీక్ అయింది. సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పటికే ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో లీక్ అయింది.
కాగా ఈ లీక్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పాటను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
మేము వందల గంటలు ఈ పాటను రూపొందించాము. ఒక సూపర్ టాలెంటెడ్ సింగర్ చేత పాడించాం. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో సౌండ్ మిక్స్ చేసి పాట కోసం లిరికల్ వీడియోను రూపొందించాము. మేము ఒకరిని నమ్మి పని ఇచ్చాము, కానీ వారు వీడియోను ప్రపంచానికి లీక్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆడియో ను విడుదల చేశారు.
— thaman S (@MusicThaman) February 12, 2022
థమన్ వాయిస్‌లోని నిరాశ, బాధ ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. ఈ విషయంపై ఎంత విచారంగా ఉన్నాడో కూడా అర్థం చేసుకోవచ్చు.
With Heavy heart 💔 !!
WE AS A TEAM
Fought for the best from LAST 24 hours And We are Coming today at 4:05 PM #Kalaavathi Will Be In ur Hearts 💕 for sure 🎹💿🎧From the heart to u All 💃🖤
Love U guys !! #SVPFirstSingle 🎥 #SarkaruVaariPaataMusic #SarkaruVaariPaata 🎬🎹 pic.twitter.com/57jjj8uLVj
— thaman S (@MusicThaman) February 13, 2022