పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు అభిమానులు.
కానీ అభిమానులను నిరాశ పరుస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు మేకర్స్. సంక్రాంతి అప్‌డేట్ రావడానికి ఆలస్యమవుతుందని.. ఆ అప్డేట్ ఎప్పుడనేది వెల్లడిస్తామని తెలిపింది.
అయితే పాట వెయింటింగ్‌కి సరిపడ వర్త్ తో ఉంటుందని, అప్పటి వరకు వెయిట్ చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.