Sarkaru Vaari Paata Movie Review సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. అలాగే వెన్నెల కిషోర్, సముద్రఖని, నదియా, సుబ్బరాజు కీలక పాత్రలో నటించారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అయింది.

Sarkaru Vaari Paata Movie Review
ఇక కథ విషయానికొస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు యూ ఎస్ లో లోన్ రికవరీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఓ సంఘటన కారణంగా డబ్బు విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తుంటాడు మహేష్ బాబు. అలాంటి మహేష్ బాబు ను కళావతి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అప్పు తీసుకొని మోసం చేస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాలు, కళావతి తండ్రి రాజేంద్ర నాథ్ కు మహేష్ కు మధ్య విభేదాలు ఇలా కొన్ని మలుపులతో సర్కారు వారి పాట కథ ఉంటుంది. అయితే రాజేంద్రనాథ్ ను మహేష్ ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలా ఎదుర్కొంటాడు దేనికోసం ఇదంతా అనేదే ఈ సినిమా కథ.
ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కామెడీ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మహేష్ బాబు అభిమానులు కూడా ఎలాంటి లైన్ కోరుకుంటారో అలాంటి లైన్ తోనే డైరెక్టర్ పరుశురాం వచ్చాడు. అలాగే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించాడు. ముఖ్యంగా మహేష్ కామెడీ టైమింగ్ హైలెట్ గా నిలుస్తుంది. అంతే కాకుండా మహేష్ ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనిపిస్తాడు. మహేష్ కీర్తి సురేష్ ల మధ్య లవ్ ట్రాక్ ,ఇద్దరి కెమిస్ట్రీ, పరుశురాం మార్క్ కామెడీ పంచ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. నటన పరంగానే కాకుండా తన గ్లామర్ తో కూడా కీర్తి సురేష్ ఆకట్టుకుంటుంది.
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మంచి కథ తీసుకున్నప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో కాస్త తడబడినట్లు కనిపిస్తుంది. కొన్నిచోట్ల లాజిక్ లేనట్లు కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కీర్తి సురేష్ కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. సెకండాఫ్ లో సీక్వెన్స్ లు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం సినిమాకు మైనస్ గా చెప్పవచ్చు.
అలాగే సాంకేతిక విభాగం విషయానికి వస్తే తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. అలాగే విజువల్స్ కూడా బాగుంటాయి. సినిమాటోగ్రఫీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సామాన్య సినీ అభిమానులకు పర్వాలేదు అనిపించుకుంటుంది. మొత్తంగా ఇది ఒక సోషల్ మెసేజ్ తో సాగే యాక్షన్ డ్రామాగా నడుస్తుంది.