సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాటకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా సెకండ్ సింగిల్ పైనే పడింది. మరోవైపు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ థమన్ కూడా అప్డేట్స్ ఇస్తున్నాడు.
తాజాగా థమన్ మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చాడు. రచయిత అనంత్ శ్రీరామ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ “మాసివ్ వన్ లోడింగ్ ” అంటూ పోస్ట్ చేశాడు.
ఇక ఈ మాసివ్ సెకండ్ సాంగ్ ను మార్చి 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సముద్రఖని, జగపతి బాబు, వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేశంలో నిజ జీవితంలో జరిగిన సంఘటనలు బ్యాంకు మోసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.