ఉన్నట్టుండి సడెన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది సర్కారువారి పాట. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి హంగామా మొత్తం ముగిసింది. ఇలాంటి టైమ్ లో ఇది ట్రెండింగ్ లోకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి ఓ కారణం ఉంది.
మహేష్-కీర్తిసురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన సర్కారువారి పాట సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ ను మరోసారి ట్రెండ్ చేశారు. అలా సోషల్ మీడియాలో మహేష్ సినిమా పేరు మరోసారి మారుమోగిపోయింది.
ఎలాంటి అదనపు రుసుములు లేకుండా నేరుగా ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ. ఇంతకుముందు కేజీఎఫ్2 సినిమా కోసం అదనపు చార్జీలు వసూలు చేసిన ఈ ఓటీటీ కంపెనీ, అప్పట్లో వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నేరుగానే మహేష్ మూవీని స్ట్రీమింగ్ కు పెట్టింది.
ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. దీంతో తన నెక్ట్స్ సినిమాకు కూడా తమన్ కే అవకాశం ఇచ్చాడు మహేష్.