సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఇదిలా ఉండగా మహేష్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మేకర్స్ అధికారికంగా ఫస్ట్ సింగిల్ గురించి ప్రకటించారు. ఫిబ్రవరి 14న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇక ఏప్రిల్ 1న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ ల పై ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.