పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కార్ వారి పాట. భారీ అంచనాల మధ్య బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా లుక్స్ ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అనేక రికార్డులను బ్రేక్ చేసి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.
ఇప్పుడు రెండో సింగిల్ కు సంబంధించిన అప్డేట్ తో వచ్చాడు దర్శకుడు థమన్. మా కళావతిని సెన్సేషనల్ కళావతిగా మార్చినందుకు ధన్యవాదాలు, ఈరోజు సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ సన్నాహాలు ప్రారంభిస్తున్నాము అంటూ చేపుకొచ్చరు.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, మరియు జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.