సామాన్యంగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే రాజకీయ నాయకులు కురిపించే హామీలు అన్ని ఇన్ని కావు. సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉన్నవారు భారీ వాగ్దానాలు చేశారంటే ఓ అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఓ సర్పంచ్ అభ్యర్థి ఏకంగా తాను గెలిస్తే గ్రామంలో మూడు ఎయిర్ పోర్టులు, రూ.100 లకే గ్యాస్ సిలిండర్, రూ.20 లకే పెట్రోలు ఇస్తానని ఆ గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చేస్తున్నాడు.
హర్యాణాలోని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ వ్యక్తి.. ఇచ్చిన హామీలు నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఆయన ఇస్తున్న హామీలతో వేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సిర్సాద్ గ్రామంలో సర్పంచ్ పదవికి జైకరణ్ లత్వాల్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఆయన ప్రజలకు ఇస్తున్న హామీలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. హామీలకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు.
ఆ పోస్టర్‌ను గ్రామంలో ప్రతి చోట అతికించారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరీ దారుణంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా చేయలేని పనులను ఆయన చేస్తానని ఆ పోస్టర్‌లో పేర్కొన్నాడు.తనను సర్పంచ్‌గా గెలిపిస్తే.. గ్రామంలో మూడు ఎయిర్ పోర్ట్‌లను నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు పెట్రోల్ లీటర్ రూ.20లకే అందజేస్తాడంట. గ్యాస్ సిలిండర్ రూ.100లకే ఇచ్చేలా చేస్తానని పేర్కొన్నాడు. అంతటితో కూడా ఆగలేదు.. జీఎస్‌టీని రద్దు చేస్తానని కూడా హామీ ఇచ్చాడు.
మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, మందు తాగేవారికి ఓ మద్యం బాటిల్, ఉచిత వైఫై కూడా అందిస్తాడంట. ఇంకా గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రో లైన్ వేయిస్తాడట. ఇంకా విచిత్రమైన హామీ గురించి చెప్పుకోవాలి. సిర్‌ఫాడ్ గ్రామం నుంచి గోహాన్ మండల కేంద్రం వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెల్ కాప్టర్ ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చాడు.ఈ హామీల పోస్టర్ ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్టర్‌లో మొదట జైకరణ్ లత్వాల్ విద్యావంతుడు, కష్టజీవి, నిజాయితీ గల అభ్యర్థి అని పేర్కొన్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఆ పోస్టర్‌ను నిశితంగా పరిశీలిస్తే.. అతని ఫోటోతో సహా వాగ్దానాల జాబితా కనిపిస్తుంది. అతను ఇచ్చిన హామీలు ట్విట్టర్‌లో నవ్వులు పూయించాయి. తనకు వెంటనే ఆ గ్రామానికి వెళ్లానుందని అరుణ్ బోత్రా కూడా క్యాప్షన్ పెట్టారు. కొందరు వ్యగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ పోస్టర్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది. మరీ దారుణంగా పంచాయతీ ఎన్నికల్లో ఓ సర్పంచ్ పోస్టుకు ఈ రేంజ్‌లో వాగ్దానాలు చేయడం అందరూ అవాక్కయ్యేలా చేస్తుంది.
Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc
— Arun Bothra 🇮🇳 (@arunbothra) October 9, 2022