ప్రభుత్వం సర్పంచ్‌లకు సరైన గౌరవం ఇవ్వకుండా, సర్పంచ్‌లను తక్కువ చేసేలా చేస్తున్న తీరుకు నిరసనగా సర్పంచ్‌ల సంఘం తరుపున హుజూర్‌నగర్ బరిలో నిలబడి ఊరూరు తిరుగుతాం అంటూ ఇప్పటికే ప్రకటించింది సర్పంచ్‌ల సంఘం. దాంతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్, మహిళా అద్యక్షురాలు ధనలక్ష్మిలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, సికింద్రాబాద్ తీసుకొచ్చారని, తమ నేతల ఫోన్‌లు కూడా లాగేసుకున్నారని సర్పంచ్‌ల సంఘం ఆరోపించింది. దీన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, డీజీపీతో మాట్లాతానని హామీ ఇచ్చారని సర్పంచ్‌ల సంఘం పేర్కొంది.