ఇతరప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా సరే మా గ్రామానికి రావాలంటే ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించిన తరువాతే మా గ్రామానికి రావాలంటూ గ్రామ సర్పంచ్.. గ్రామపంచాయతి నోటీస్ బోర్డు పై తీర్మానం చేసిన కాపిని అతికించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తమవుతున్నారు. తమ ఊరుకు రావాలంటే కరోనా వైరస్ పై ఆరోగ్య కేంద్రంలో వైధ్యపరీక్షలు చేయించుకొని రావాలని విచిత్ర పద్దతికి స్వీకారం చుట్టారు. కన్మన్‌కాల్వ గ్రామం ఏకంగా తీర్మానం చేసింది. సర్పంచ్ రెండు రోజులుగా విస్తృత ప్రచారం చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించుకొని, కరోనా వైరస్ లేదని నిర్దారణ వచ్చిన తరువాత చమ గ్రామానికి రావాలంటూ తీర్మానం చేశారు. గ్రామంలోని ఆశ వర్కర్ల ద్వార గ్రామస్తులకు కరోనా పై జాగ్రత్తలను వివరిస్తున్నారు.కరోనా వైరస్ ప్రభలటంతో తెలంగాణ పోలీసులు అప్రమతమైయ్యారు. సహయం కోసం పోలీస్ స్టేషన్ లకు వచ్చే వారి కోసం మంచినీటిని, యాంటి బ్యాక్టేరియా లిక్విడ్ ను అందుబాటులో ఉంచారు.
పోలీస్ స్టేషన్ లకు ఫిర్యాదులు, సహయం, పోలీస్ అధికారులను కలిసేందుకు వచ్చే వారి కోసం ముందు జాగ్రత్తగా స్టేషన్ ఆవరణలోనే మంచినీటి సౌకర్యం, యాంటి బ్యాక్టిరియా లిక్విడ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టేషన్ మెయిన్ గేట్ దాటిన వెంబడే ఏర్పాటు చేయడంతో పోలీసు సిబ్బంది, బాధితులకు నీటిని అందించి, లిక్విడ్ ను చేతులో వేసి శుభ్రంగా కడుక్కునే విధంగా చూస్తున్నారు.