కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్రనేత రాహుల్‌ని కలిశారు మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్లమెంటరీ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీలో జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై చర్చ జరిగిందన్నారు. అన్నింటిపై సమగ్ర నివేదిక సమర్పించమని సోనియాగాంధీ చెప్పినట్లు వివరించారు సర్వే సత్యనారాయణ.