స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలకు తగ్గటే దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లో వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో పోటీ పడుతూ కలెక్షన్స్ ను రాబడుతోంది. సినిమా హిట్ టాక్ ను అందుకోవడంతో ఈ సినిమా బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా బాగుందంటూ పవన్ కల్యాణ్, డైరెక్టర్ శ్రీనువైట్ల, సుశాంత్ ప్రశంసించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాపై హీరో శర్వానంద్ స్పందించారు. ‘ అల వైకుంఠపురములో సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ బాగా మెప్పించారు.. ప్రతి సీన్ లో కుమ్మేశారు .. ఒక నటుడిగా ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. శుభాకాంక్షలు త్రివిక్రమ్ గారు, తమన్, చిన్నబాబు అలాగే చిత్ర యూనిట్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే వెంటనే శర్వానంద్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు బన్నీ. ‘‘మైడియర్ శర్వా… సినిమాను అభినందించినందుకు థాంక్స్. సినిమాను, నా వర్క్స్‌ను ఇష్టపడ్డందుకు చాలా హ్యాపీగా ఉందంటూ రీట్వీట్ చేశారు బన్నీ.