టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శ్రీకారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట గోపీ అచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ఓ రైతు పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, శర్వానంద్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ తో ఉన్న పోస్టర్ ను కూడా విడుదల చేసింది.