హీరో సాయికుమార్ వారసుడిగా ప్రజలకు సుపరిచితమైన ఆది యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న మూవీ శశి… త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. చిరంజీవి చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు.