అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరుల సెంట్రల్‌లో జైలులో ఉన్న శశికళ.. గత బుధవారం అస్వస్థతకు గురికాగా, అక్కడి లేడీ క్యూర్‌జోన్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే సమస్య నుంచి కోలుకోకపోగా.. జ్వరం, వెన్నునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆమెను బెంగళూరులోనే విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. వాస్తవానికి అంతకు ముందే యాంటిజెన్ టెస్ట్ చేశారు. అందులో నెగెటివ్ అనే వచ్చింది. దీంతో మరో ప్రయత్నంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమెకు అందుకు సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు.అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. ఈ నెల 27న విడుదల కానున్నట్లు ఇప్పటికే ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు.