ఉక్రెయిన్ లోని బుచా పట్టణంలో ఓ చర్చి సమీపంలో ఇటీవల పౌరుల మృత దేహాలకు రష్యా సైనికులు సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
ఆ ప్రాంతంలో మృతదేహాలను ఖననం చేసేందుకు 45 అడుగుల పొడవు గల ఓ కందకాన్ని తవ్వినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని మ్యాక్సర్ టెక్నాలజీస్ అనే సంస్థ వెల్లడించింది.
మృత దేహాలను సామూహికంగా ఖననం చేసేందుకు సెయింట్ అండ్రూస్ చర్చి వద్ద పెద్ద గుంత తవ్విన గుర్తులు మొదటగా మార్చి 10న కనిపించినట్టు మ్యాక్సర్ టెక్నాలజీ వెల్లడించింది.
ఇటీవల మార్చి 31న తాజాగా తీసిన శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే చర్చికి సమీపంలో నైరుతి విభాగంలో సుమారు 45 అడుగుల పొడవైన కందకంతో సమాధి స్థలాన్ని చూపించింది” అని మాక్సర్ తెలిపింది.
Advertisements
రష్యా సైనికులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా తీవ్రంగా మండిపడ్డారు. సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న వారిపై రష్యా సైనికులు ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను రష్యా ఖండించింది.