సతీష్ మాదిగ, టీపీసీసీ అధికార ప్రతినిధి
ప్రజాస్వామ్యం ముసుగు వేసుకున్న నియంత సీఎం కేసీఆర్ ..
తన నియంత పోకడలను .. ప్రజాస్వామ్య ముసుగు వేసుకొని అమలు చేస్తున్నాడు ..
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 1960-70 నాటి పరిస్థితులు తలపిడితున్నాయి ..
అగ్రవర్ణాలకు అనుకూలంగా సీఎం కేసీఆర్ పాలనాపరమైన నిర్ణయాలు జరుగుతున్నాయి ..
ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం వెనుక పెద్ద కుట్ర దాగివుంది ..
ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ పేద పిల్లలను చదువుకు దూరం చేసే కుట్ర ఇందులో దాగివుంది ..
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పదిమంది విద్యార్థులు ఉన్నా స్కూల్స్ ను టీచర్స్ పెట్టి నడిపాయి ..
పేదల పట్ల కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్దికి అది నిదర్శనం ..
ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే .. ఇక్కడ ఉన్న స్కూల్స్ మూసేస్తున్నారు ..
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక టీచర్ల నియామకానికి స్వస్తి పలికారు .. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు ..
టీఎస్పీఎస్సీ నుంచి వెలువడిన నోటీఫికేషన్స్ అన్ని లోపభూయిష్టంగా ఉంటున్నాయి ..
నోటీఫికేషన్స్ వేయడం .. మధ్యలోనే ఆపేయడం ఓ ప్రహసనంగా మారింది ..
నోటీఫికేషన్స్ వేసి .. నిరుద్యోగులు రోడ్లపైకి రాకుండా .. అలాగని ఉద్యోగాలు రాకుండా .. వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ..
ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఆలోచన .. వేలాది మంది కార్మికుల పొట్టకొట్టేదిగా ఉంది ..
ఆర్టీసీని ప్రవేటు పరం చేసే కుట్ర జరుగుతోంది..
ప్రజా రవాణా ను ప్రవేటు చేతుల్లో పెట్టే కేసీఆర్ ఆలోచనను ప్రజలు వ్యతిరేకించాలి .. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాలి ..
భూరికార్డ్స్ ప్రక్షాళన పేరుతో రెవెన్యూ ఉద్యోగులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేశాడు ..
ధరణి వెబ్ సైట్ .. ఓ తప్పుల తడక ..