శ్రీ చైతన్య విద్యార్ధి సాత్విక్ సూసైడ్ నోట్ కంట తడి పడ్డి పెట్టిస్తోంది. అమ్మ నాన్నలకు క్షమాపణలు చెబుతూ ఆయన రాసిన చివరి అక్షరాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. సాత్విక్ సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో ఆత్మహత్యకు దారి తీసిన విషయాలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది.
అమ్మా, నాన్నా నన్ను క్షమించండి అంటూ సూసైడో నోట్‌లో సాత్విక్ పేర్కొన్నాడు. ఎవరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన లేఖలో స్పష్టం చేశాడు. లేఖలో కాలేజీ ప్రిన్సిపాల్, ఇన్ఛార్జ్, లెక్చరర్స్ పేర్లను ప్రస్తావించాడు. వారి టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
కాలేజీ సిబ్బంది కృష్ణా రెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ తనను వేధింపులకు గురిచేసినట్లు లేఖలో తెలిపాడు. వీరందరూ ఏకమై హాస్టల్ లో చదివే విద్యార్థులను తీవ్ర వేధింపులు గురి చేస్తున్నారంటూ సాత్విక్ ఆరోపించాడు. ఈ వేధింపులకు తాను తాళలేక పోయానన్నాడు.
అందువల్లే తాను ఇంత పెద్ద నిర్ణయానికి రావాల్సి వచ్చిందని తెలిపాడు. తనని వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశాడు. తాను వెళ్లిపోతున్నానంటూ స్నేహితులకు సాత్విక్ సారీ చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.