సత్యదేవ్, కన్నడ హీరో డాలీ ధనంజయ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ చిత్రానికి ‘జీబ్రా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తిరంగా ఉంది. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.
పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెనిఫర్ పిచినెటో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే 50 రోజుల మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ప్రాంతంలో ప్లాన్ చేశారు. ఈ పాన్-ఇండియన్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.