డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ను అందుకుంటున్నాడు హీరో సత్యదేవ్. ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు సత్య దేవ్. అయితే తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. తిమ్మరుసు అనే సినిమాతో సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అసైన్ మెంట్ వాలి అనేది ట్యాగ్ లైన్.
అయితే ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. కాగా టీజర్ ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.