జాను సినిమాతో పాటు రిలీజ్ అయిన సవారీ చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించబోతుంది. యాక్టింగ్ పరంగా తానేంటో నిరూపించుకున్న నందూకు సినిమా కథతో పాటు ఇతర అంశాలన్నీ మైనస్‌గా మారినట్లు స్పష్టంగా కనపడుతోంది. కథలో కొత్తదనం లేకపోవటం, పేలవమైన స్క్రీన్ ప్లే, కథను వివరించే తీరు ప్రేక్షకులకు చిరాకు పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు.
నందూ సరసన హీరోయిన్‌గా నటించిన ప్రియాంక కొన్ని సీన్స్‌లో అద్భుతంగా కనిపించినా… ఆమె యాక్టింగ్ యావరేజ్‌గా ఉంటుంది. అయితే గుర్రం కోసం తను ఎలా ఇబ్బందిపడతాడో చెప్పే కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు. సినిమా ట్రైలర్ జనాన్ని థియేటర్ల వద్దకు రప్పించినా… మెప్పించటంలో మాత్రం ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే… సినిమా కాస్త అయిన నిలబడగలిగిందంటే నందూ నటనతో పాటు శేఖర్ చంద్ర మ్యూజిక్, మనీష్ భూపతి కెమెరా పనితనం సినిమాకు అడ్వాంటేజ్ అయ్యింది.
పాత కథలోనే గుర్రం సన్నివేశాలను చొప్పించినట్లుగా ఉండే కథనంతో దర్శకుడు సాహిత్ మెప్పించలేకపోయాడు. స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అన్నీ తానే బాధ్యత తీసుకున్నా… ఒక్క డైరెక్షన్ మినహా ఇతర రంగాల్లో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకోలేకపోయాడు. అయితే… ఈ సినిమా ద్వారా నందులోని మంచి నటున్ని దర్శకుడు వెలికి తీశాడని చెప్పుకోవచ్చు.