అప్పట్లో అక్కినేని, సావిత్రి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలు అంటే నిర్మాతలకు పండుగే. 1950 నుంచి 80 వరకు సావిత్రి పేరు వినపడితే పూనకాలు వస్తాయి. దాదాపు అప్పటి హీరోలు అందరితో ఆమె సినిమాలు చేసేసారు.
Also Read:నిర్మల్ మైనర్ బాలికపై అత్యాచారం… ఎట్టకేలకు టిఆర్ఎస్ నేత అరెస్ట్
పౌరాణికం, జానపదం, సాంఘీకం ఇలా అన్ని కథలు ఆమె సినిమాలు చేసారు. ఇక ఆమె అక్కినేని అంటే చాలా ఇష్టం. ఆమె చిన్నపిల్లగా ఉన్న సమయంలోనే విజయవాడలో అక్కినేనిని చూడటానికి వచ్చారట. అప్పుడు జనాలు పక్కకు తోయడం తో కింద పడ్డాను అని కూడా ఆమె చెప్పుకుంది. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా మారడం అక్కినేనిని పిచ్చి పిచ్చిగా నమ్మడం జరిగాయి. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నాను అని చెప్పే వారట.
ఆయన కోసం ఏకంగా రెండేళ్ల పాటు వరుసగా డేట్స్ ఇచ్చేవారట సావిత్రి. ఎన్టీఆర్ సినిమాలను కూడా అక్కినేని కోసం వదులుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన్ను పెళ్లి చేసుకోవాలని సావిత్రి బలంగా అనుకునే వారట. అయితే ఆ తర్వాత జెమిని గణేషన్ ప్రేమలో పడటం, ఆయన చెప్పిన మాటలు పూర్తిగా నమ్మడం జరిగాయి. తప్పని పరిస్థితిలో ఆయన్ను వివాహం చేసుకుంది. అయితే ఆయనకంటే సావిత్రికి క్రేజ్ ఎక్కువగా ఉండటంతో జెమిని కాస్త ఇబ్బంది పడ్డారు. ఎన్నో సందర్భాల్లో అక్కినేని… సావిత్రికి ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారట. అయితే జెమిని మాయలో అక్కినేని మాటలను ఆమె వినలేదట.
Also Read:చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి