నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీ విరుచుకుపడ్డారు. తమ సభ్యత్వాన్ని నాటో అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రష్యాకు నాటో భయపడుతోందని బహిరంగంగా ప్రకటించాలని అన్నారు.
‘మా సభ్యత్వాన్ని నాటో అంగీకరిస్తోందా లేదా రష్యాకు భయపడి అంగీకరించడం లేదా అనే విషయాన్ని బహిరంగంగా నాటో ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. తాము నాటోలో సభ్య దేశం అయి ఉంటే రష్యా దండెత్తి ఉండేది కాదన్నారు.
తాము నాటో సభ్యులం అయి ఉంటే ఇప్పుడు ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదని తెలిపారు. తన దేశానికి, ప్రజలకు భద్రతా హామీలను పొందాలనుకుంటున్నట్టు చెప్పారు. నాటో సభ్యులు కూటమిలో తమను చూడటానికి సిద్ధంగా ఉంటే, వెంటనే సభ్యత్వాన్ని అంగీకరించాలని కోరారు.
రోజూ వేల మంది చనిపోతున్నందున దీనిపై త్వరగా ఏదో ఒకటి తేల్చాలన్నారు జెలెన్ స్కీ.