కొప్పు భాషా,
బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు దళితులు అంటే ఎంత ప్రేమో దీనిని చూస్తే తెలుస్తోంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన ఐరు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు.
చనిపోయేంత వరకు కూడా ప్రజల సేవ చేస్తూనే ఉన్నారు. మొదట ప్రభుత్వ అధికారలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి.. తర్వాత మర్చిపోవడం శోచనీయం. సీఎం కేసీఆర్ చూపిన వైఖరి కేసీఆర్ కి దళితుల పట్ల ఉన్న వివక్ష అని తెలుస్తోంది. ఇప్పటికి రాష్ట్రంలో ఎంతో మంది సినీ నటులకు, రాజకీయ నాయకులకు కేసీఆర్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
కానీ ప్రజల ఆశీస్సులు పొంది మూడు దశాబ్దాలుగా సేవలు చేస్తున్న వారికి మాత్రం ఎటువంటి అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు. ఇది అంతా కూడా కేసీఆర్ రాక్షసానందానికి తార్కణమన్నారు. ఏడో నిజాం మనవుడు ఎక్కడో టర్కీలో చనిపోతే ఇక్కడ అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం వారికి ఇచ్చిన గౌరవం కూడా సాయన్నకి ఇవ్వలేదు.
దళితుల్ని, దళిత సమాజాన్ని, దళిత నాయకత్వాన్ని, దళిత ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ తన విధివిధానాల గురించి తెలంగాణ సమాజానికి చెప్పాలన్నారు. కేసీఆర్ వైఖరికి ప్రజలు త్వరలోనే ధీటుగా సమాధానం చెబుతారు. త్వరలోనే మాజీ సీఎం ని చెస్తారు.