సాధారణంగా హీరోయిన్ లకు పెళ్లి అయితే పెద్దగా సినిమాలు చేయరనేది ఇండస్ట్రీలో టాక్. అందులోనూ పెళ్లి అయి తల్లి అయ్యింది అంటే.. స్టార్ హీరోల పక్కన అక్కాచెల్లెళ్లను చేసేస్తున్నారు. కానీ ఓ స్టార్ హీరో భార్య మాత్రం పెళ్లై.. తల్లైనా.. ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండస్ట్రీలో చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. సాయేషా సైగల్. అలనాటి నటి నజీరా భాను ముద్దుల మనవరాలు.. పైగా కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఆర్య భార్య.
‘అఖిల్’ సినిమాతో తెలుగుతెరకు చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా. మొదటి సినిమాతో యూత్ ను మొత్తం తన వైపు తిప్పుకుంది. అయితే ఆ సినిమా విజయం అందుకోకపోవడంతో టాలీవుడ్ కు బై బై చెప్పేసి.. ఇక తమిళ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఆర్యతో ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు అరియనా అనే ఒక పాప కూడా ఉంది.
ఇప్పటి దాకా అమ్మ పాత్రలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్న సాయేషా.. రీ ఎంట్రీకి మాత్రం హీరోయిన్ గానో, సపోర్టివ్ క్యారెక్టర్ గానో కాకుండా ఏకంగా ఐటెం గర్ల్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ హారో శింబు, గౌతమ్ కార్తీక్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘పాతు తలా’ సినిమాలో ఈ హాట్ బ్యూటీ ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ పాటలో అందాలు ఆరబోస్తూ డాన్స్ ఇరగదీసింది. ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సాంగ్ పట్ల కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతూంటుంటే.. మరికొంతమంది మాత్రం సాయేషాను ఏకిపారేస్తున్నారు. స్టార్ హీరో భార్యవి.. పైగా ఒక బిడ్డ తల్లివి అయ్యి ఉండి ఇలా ఐటెం సాంగ్ చేయడం ఏంటని రియాక్ట్ అవుతున్నారు.