బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో బిబి3 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో మాస్ యాంగిల్ ఏ మేర ఉందో అర్థం అయిపోతుంది.
అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన సాయేషా సైగల్ ను ఎంపిక చేశారు. బిబి3 టీంతో పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె ట్వీట్ చేసింది. మరోవైపు ప్రగ్యా జైస్వాల్ మరో హీరోయిన్ గా నటించనుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.