బ్యాంకులో పనిచేస్తున్న ఉన్న నలుగురు అధికారులకు కరోనా సోకటంతో… మున్సిపల్ అధికారులు జగిత్యాల ఎస్బీఐ బ్యాంక్ ను మూసివేశారు. బ్రాంచ్ ను క్లోజ్ చేసిన అధికారులు… బ్రాంచ్ మొత్తాన్ని శానిటైజ్ చేయించారు. దీంతో బ్యాంకు లావాదేవీలన్నీ నిలిచిపోయాయి.
బ్యాంకు అధికారులకు కరోనా సోకటంతో ప్రైమరీ కాంటాక్ట్స్ అంతా భయాందోళనలకు గురవుతున్నారు. జగిత్యాలలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. మహారాష్ట్రతో ఈ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగిత్యాల జిల్లాలోని ఓ చేగుర్తి అనే గ్రామంలో ఏకంగా 37మందికి వైరస్ సోకింది.
జగిత్యాల జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో… ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయటంతో పాటు టెస్టుల సంఖ్యను పెంచాలని మంత్రి ఈటెల రాజేందర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.