మరోసారి వడ్డీ రేట్లను పెంచేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో బ్యాంకు నుంచి లోన్లు తీసుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎంసీఎల్ఆర్ పెరిగినందు వల్ల వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు వెల్లడించింది. బ్యాంకులు ఇచ్చే కనీస వడ్డీరేటును ఎంసీఎల్‌ఆర్ అంటారు. దీంతో హోమ్ లోన్లు తీసుకునేవారిపై అధిక భారం పడనుంది.
ఏడాది కాల పరిమితి కలిగిన వడ్డీలపై ఎంసీఎల్ ఆర్ రేటు 7.70 శాతం నుంచి 7.80 శాతానికి చేరుకుంటుంది. నెల, మూడు నెలల వడ్డీ రేటు 8 శాతంగా, ఆరు నెలల వడ్డీ రేటు 8.3 శాతం ఉంది.
రెండేండ్ల కాలపరిమితి ఉన్న వడ్డీలపై ఎంసీఎల్‌ఆర్ రేటు 8.5 శాతంగా ఉంచిన బ్యాంక్.. మూడేండ్ల వడ్డీ రేటును 8.6 శాతంగా ఉంచింది. పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది.
కాగా నెల రోజుల వ్యవధిలో ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి. ఎస్బీఐతో పాటు హెచ్ డీఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు కూడా ఎంసీఎల్‌ఆర్ పెంచాయి.