ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ కొత్త రూల్స్‌ను తీసుకరాబోతుంది. జనవరి 1 నుండే అమలులోకి రానున్న ఈ రూల్స్‌తో ఖాతాదారులకు మరింత భద్రతను కల్పిస్తుందని బ్యాంకు వర్గాలు ప్రకటించాయి. ముఖ్యంగా మోసాలకు ఈ విధానం ద్వారా చెక్ పెట్టవచ్చని బ్యాంకు స్పష్టం చేసింది.
కేటీఆర్ కోసమే కేసీఆర్ వ్యూహం మార్చారా…?
ఏటీఎం సెంటర్‌లో అర్థంకాక ఎవరి సహయం అయినా తీసుకుంటే… ఆ కార్డు డిటెయిల్స్‌తో కొంతమంది మన ఖాతా నుండి సొమ్మును దొంగిలించేవారు. కానీ ఇక నుండి అలాంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఎస్బీఐ కస్టమర్లకు. ఇక నుండి ఏటీఎం నుండి నగదు డ్రా చేయాలనుకుంటే రిజిస్టర్డ్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఏటీఎంలో పాస్‌వర్డ్‌తో పాటు ఓటీపీ ఎంట్రీ చేస్తేనే మన డబ్బు వస్తుంది. అయితే ఈ సదుపాయం రాత్రి 8గంటల నుండి ఉదయం 8గంటల మధ్య మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ సమయంలో ఓటీపీతో కేవలం 10వేల వరకు మాత్రమే డ్రా చేసుకునే వీలుండగా… ప్రస్తుతానికి కేవలం ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
మహేష్ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడా…?
ఇంతవరకు బాగానే ఉన్నా… చాలా సార్లు ఎస్బీఐ ఓటీపీ సర్వీసులు ఆలస్యం అవుతుంటాయి. ఇప్పుడు ఓటీపీ జనరేట్ చేస్తే ఎప్పటికో వస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి సర్వీసులే ఉంటే ఖచ్చితంగా ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Advertisements