సుప్రీం కోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి సీజేఐ బాధ్యతలు చేపట్టే వరకు నూతన జడ్జిల నియామకానికి ప్రతిపాదనలు చేయకూడదని నిర్ణయించింది.
సీజేఐ జస్టిస్ ఎన్వీ. రమణ నేతృత్వంలో సుప్రీం కోర్టు కొలీజియం సీజేఐ సెక్రటేరియట్ కార్యాలయంలో సమావేశం అయింది. కేంద్ర న్యాయ శాఖ నుంచి వచ్చిన లేఖపై ఈ సందర్బంగా చర్చించారు.
సీజేఐ ఎన్వీ రమణ పదవీ కాలం ఈ నెల 26తో ముగియనుండటంతో తదుపరి ఆ పదవికి అభ్యర్థి పేరును సిఫారసు చేయాలంటూ సీజేఐ ఎన్వీ. రమణను న్యాయ శాఖ కోరినట్టు పేర్కొంది.
హైకోర్టులు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకాల సిఫారసుల కోసం తదుపరి సీజేఐ బాధ్యతలు స్వీకరించే వరకు వేచి వుండటం మేలని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.