ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్తానం తీవ్ర ఆగ్రహం వక్తం చేస్తూ విచారణకు తిరస్కరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఆవుల పరిరక్షణ చాలా ముఖ్యమని అన్నారు.
దీనిపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ‘ఇదేనా కోర్టు పని? అంటూ ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు ఎందుకు దాఖలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ జంతువుగా ఆవును ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ గోవాన్ష్ సేవా సదన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
మరోవైపు, రాజకీయ పార్టీలు క్రిమినల్ నేరప్రవృత్తి కలిగిన అభ్యర్థుల వివరాలను తమ వెబ్ సైట్లలో పొందుపరచాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఒక నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ విషయంపై భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలంటూ పిటిషనర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ గ్యాంగ్‌స్టర్ నహీద్ హసన్‌కు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.