నీట్ పీజీ-2022 కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. పిటిషన్ పై జస్టిస్ డీవై. చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది.
పరీక్షల్లో జాప్యం జరిగితే వైద్యుల కొరత ఏర్పుడుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
ఒక వేళ గడువు పొడిగిస్తే అది జనవరి 2016లో కోర్టు నిర్ణయించిన అడ్మిషన్ షెడ్యూల్‌పై ప్రభావం చూపుతుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. నీట్ పీజీ 2022 పరీక్ష ఇప్పటికే 4 నెలలు ఆలస్యమైందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
నీట్ పీజీ 2023-24 షెడ్యూల్ ను 2023 జనవరిలో నిర్ణయించారని, రెండేండ్లుగా కొవిడ్ -19 కారణంగా షెడ్యూల్ కు ఆటంకాలు ఏర్పడ్డాయని, వాటిని తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడానికి ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.